వీరప్పన్ పెళ్లాం చంపేస్తుంది… మోదీకి లేఖ… - MicTv.in - Telugu News
mictv telugu

వీరప్పన్ పెళ్లాం చంపేస్తుంది… మోదీకి లేఖ…

October 7, 2018

ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ఎన్‌కౌంటర్ జరిగి పద్మాలుగేళ్ళ అవుతోంది. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ తీసిన ‘వీరప్పన్’ సినిమా తర్వాత అందరూ ఆ సంఘటన గురించి మరిచిపోయారు. అయితే తాజాాగా ఈ ఘటనకు సంబంధించిన వార్తలు బయటికి వస్తున్నాయి. నాడు వీరప్పన్ ప్రతి కదలికపై పోలీసులకు సమాచారం అందించిన షణ్ముఖ ప్రియ తాజాగా వార్తల్లో నిలిచారు. ‘ఆపరేషన్ కుకూన్’ పేరిట వీరప్పన్‌ను చంపడానికి రంగంలోకి దిగింది తమిళనాడు ప్రభుత్వం. వీరప్పన్ భార్య ముత్తలక్ష్మితో షణ్ముఖ ప్రియ సన్నిహితంగా ఉన్నట్టు నటించింన విషయం తెలిసిందే.

ఇందులో కీలక పాత్ర పోషించిన తనకు అప్పటి ప్రభుత్వం ప్రకటించిన రూ.5 కోట్ల నజరానా ఇంతవరకు తన చేతికి అందలేదని పేర్కొంటూ ప్రధాని మోదీకి లేఖ రాసింది.

ఆ లేఖలో డబ్బు విషయమే గాకుండా తన కూతురు ఆరోగ్యం బాగాలేదని, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మితో తనకు ప్రాణహాని ఉందంటూ షణ్ముఖప్రియ ఆ లేఖలో పేర్కొంది.