మాంసప్రియులకు పండగ.. దిగొచ్చిన కోడి.. - MicTv.in - Telugu News
mictv telugu

మాంసప్రియులకు పండగ.. దిగొచ్చిన కోడి..

November 20, 2018

కార్తీకమాసం మాంసం విక్రయాలపై ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అమ్మకాలు సగానికి సగం తగ్గిపోయాయి. కార్తీక మాసానికి ముందు కిలో సుమారు రూ.220 పలికిన కోడి, ప్రస్తుతం  రూ.150 నుంచి రూ.160కే దొరుకుతోంది. దీంతో నియమనిష్టలు పంచించుకోని మాంస ప్రియులు లాగించేస్తున్నారు.

Telugu news Effect of karthika masam ...  Meat sales have fallen by half… If the chicken sales for Rs. 200 in the pre-Karthika masam price, it is currently sold at Rs. 150 per kilo.

నెల 8 నుంచి కార్తీకమాసం ప్రారంభమైంది. ప్రారంభం నుంచే మాంస విక్రయాలపై తీవ్ర ప్రభావం కనిపించింది.. రోజుకు 70 కిలోల చికెన్ అమ్మే దుకాణదారులు ఇప్పుడు రోజుకు 20 కిలోల మాంసమే అమ్ముతున్నామని లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ నగరంలో బిర్యానీ ఘుమఘుమలు కూడా తగ్గిపోయాయి. కార్తీక మాసానికి ముందు రోజుకు 15 కిలోల బిర్యానీ పొట్లాలు అమ్మే ఓ హోటల్  ఇప్పుడు ఆరు-ఏడు కిలోలే అమ్ముతోంది.

చాలా హోటళ్లలో మాంసాహారానికి బదులు శాకాహారమే వండుతున్నారు. మాంసం వండి అనవసరంగా చేతులు కాల్చుకోవడం ఎందుకంటున్నారు. కార్తీకమాసంతో పాటు చలి, ఫ్లూ జ్వరాలు పెరగడం వల్ల కూడా జనం మాంసాహారం తగ్గించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. హిందువులకు కార్తీకం పవిత్రమాసం కనుక చాలా మంది మాంసానికి దూరంగా వుంటారు. అయ్యప్పస్వాములు, శివస్వాముల మాలధారణ కూడా మాంసం అమ్మకాలు తగ్గడానికి మరో కారణం. అయితే ఏడాది మరింత ప్రభావం కనిపిస్తోంది. కార్తీకమాసంలో చాలామంది మద్యం జోలికి కూడా పోరు. మందు అమ్మకాల పరిస్థితి కూడా ఆశాజనకంగా లేనట్టు తెలుస్తోంది.

Telugu news Effect of karthika masam …  Meat sales have fallen by half… If the chicken sales for Rs. 200 in the pre-Karthika masam price, it is currently sold at Rs. 150 per kilo.