కోడిగుడ్డు.. ఉడకనంటోంది..! - MicTv.in - Telugu News
mictv telugu

కోడిగుడ్డు.. ఉడకనంటోంది..!

November 20, 2017

కోడిగడ్డు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఏకంగా ఒక్కోటి రూ. 7 పలుకుతోంది. దీంతో బీదాబిక్కీ జనాల ఇళ్లలో కోడిగుడ్డు ఉడకడం లేదు.  గుడ్ల డిమాండ్ 15 శాతం పెరగడంతోనే ధరలు పెరిగాయని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్ఈసీసీ) ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజు భోసలే అంటున్నారు. గుడ్డు ఆరోగ్యానికి మంచిది.. రోజుకొక గుడ్డు తినాలని ప్రభుత్వం సహా వైద్యులు కూడా ప్రచారం చేస్తుండంతో జనం గుడ్లను బాగా వాడుతున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల రిటైల్ గుడ్డి ధర రూ. 7కు చేరింది. విజయవాడ, విశాఖ నగరాల్లో హోల్ సేల్ గా వంద గుడ్ల ధర రూ. 532 పలుకుతుండగా.. హైదరాబాద్‌లో రూ. 535 పలుకుతోంది. ముంబై, పుణే లాంటి నగరాల్లోనైతే వంద గుడ్ల ధర ఏకంగా రూ. 585 వరకు చేరింది. నెలలోపే వంద గుడ్ల ధర రూ. 110 పెరిగింది. దీంతో బీదాబిక్కీ ప్రజలు కోడుగుడ్లపై ఆశవదిలేసుకుంటున్నారు.  కొందరైతే అంత ధర పెట్టి కొనేబదులు కోడికూర మేలు అంటున్నారు.ఒక్కో గుడ్డు సగటున 55 గ్రాములు ఉంటుంది అనుకుంటే.. కిలో గుడ్లు కొనడానికి రూ. 120-135 వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అదే రూ. 160 పెడితే స్కిన్‌లెస్ చికెనే వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో వంద గుడ్ల ధర సగటున రూ. 333 పలకగా అది క్రమంగా పెరుగుతూ.. రూ. 532 దాటింది. ఈ స్థాయిలో గుడ్ల ధరలు పెరగడం గతంలో ఎన్నడూ చూడలేదని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. నోట్ల రద్దు, కోళ్ల మేత ఖర్చులు పెరగడం కూడా గుడ్ల ధరలు పెరగడానికి కారణం అంటున్నారు. కూరగాయలకు పోటీగా గుడ్ల ధరలు కూడా పెరగడంతో జనాలకు ఏం తినాలనే సంక్షోభం ఏర్పడింది.