చప్పట్లు కొడతారనుకుంటే..గుడ్లతో కొట్టారు - MicTv.in - Telugu News
mictv telugu

చప్పట్లు కొడతారనుకుంటే..గుడ్లతో కొట్టారు

January 31, 2018

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ బాలాసోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. చుట్టూ సెక్యూరిటీ గార్డులు, ముందట వేలమంది జనం. సియంగారు స్పీచ్ మొదలు పెట్టారు. కొందరేమో ముఖ్యమంత్రి స్పీచ్’కు చప్పట్లు కొడుతుంటే ఎక్కడినుంచో ముఖ్యమంత్రిపైకి ఒక్కసారిగా గుడ్ల వర్షం మొదలైంది.

వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది గుడ్లను సియంపై పడకుండా జాగ్రత్తపడ్డారు. గుడ్లు విసిరిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఆమె సియంపై గుడ్లతో ఎందుకు సన్మానం చేసిందో అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆవీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.