ఎలక్షన్ బంపర్ ఆఫర్… రూ.10కే ఫుల్ బాటిల్… - MicTv.in - Telugu News
mictv telugu

ఎలక్షన్ బంపర్ ఆఫర్… రూ.10కే ఫుల్ బాటిల్…

December 6, 2018

రేపే ఎన్నికలు. ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు కొత్త కొత్త దారులను వెతుకుతున్నారు. వారి వీక్‌నెస్ పాయింట్ మీద కొట్టి ఓట్లు రాల్చుకోవాలని రకరకాల ఆటలు ఆడుతున్నారు. ఈ క్రమంలో పేటియం నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయటం వంటివి చేశారు. ఇప్పుడు రూ.10 ఇస్తే చాలు రూ.460 ఫుల్ మందు బాటిల్ ఇస్తున్నారు ఓ వైన్ షాపువాళ్ళు. అలాగే రూ.600 విలువగల మద్యం సీసా కేవలం రూ. 50కే ఇచ్చేస్తున్నారు. రూ.1000 మందు బాటిల్ కేవలం రూ.100కే ఇస్తున్నారు. ఇంత చవక ధరలకు మందు విక్రయిస్తున్న ఆ వైన్ షాపు పేరు సిటీ వైన్స్‌. మాదాపూర్‌లో వుంది ఈ షాపు.మరి ఇలా చీప్‌గా ఈ మందును ఎవరికి పడితే వారికి ఇవ్వరు. ఇచ్చే నోటుకు సంబంధించిన సిరీస్‌ నెంబరు సరిపోలితేనే ఇస్తారు.. లేదంటే ఇవ్వరు. ఈ బంపర్ ఆఫర్ గురించి తెలుసుకున్న మాదాపూర్‌ పోలీసులు వైన్ షాప్ మీద దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. ఆ వైన్స్ మేనేజరు ప్రవీణ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీని వెనకాల వున్న రాజకీయ నేతలు ఎవరనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.