ఎన్నికల కోడ్ సవరణలు.. ఉద్యోగులూ బరిలోకి…

అభివృద్ధి, సంక్షేమం, కొత్త పథకాల అమలుకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని.. దీంతో అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించింది. పైగా ఈ ఏడాది మొత్తం ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రభుత్వం ఓ ఆలోచన చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) పరిధిలోని ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో కీలక సవరణలు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఇకపై కోడ్‌ అమల్లో ఉండదు. అందుకు సంబంధించి ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్‌ సోమవారం ఆదేశాలను జారీ చేశారు. ఇక ఏ ప్రాంతంలో ఎన్నికలు జరిగితే అక్కడే కోడ్‌ అమలవుతుంది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పట్టణాలు, నగరపాలకులకు కోడ్‌ వర్తించదు.Telugu news Election code amendments .. Employees can competeఇంతకుముందు పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్‌, ప్రాదేశిక ఎన్నికలకు రాష్ట్రమంతటికీ ఎన్నకల కోడ్ నియమావళి వర్తించేది. భవిష్యత్తులో జరిగే మున్సిపల్‌ ఎన్నికల ప్రభావం గ్రామీణ ప్రాంతాలపై ఉండదు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో అనుబంధ ‘ఓటర్ల జాబితా’ను ప్రదర్శించాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. ఈసీఐ నవంబరు 19న తుది జాబితాను ప్రకటించింది. దీని ఆధారంగా ఎస్‌ఈసీ మొదటి అనుబంధ జాబితాను రూపొందించింది. డిసెంబరు 31 వరకు ఓటర్లుగా నమోదైన వారిని రెండో అనుబంధ జాబితాలో చేర్చాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.

ఉద్యోగులు సైతం బరిలోకి దిగొచ్చు..

టీఎస్ఆర్టీసీ, సింగరేణి ఉద్యోగులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అశోక్‌కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయా సంస్థల్లో ఎండీ, మేనేజర్, సెక్రటరీ స్థాయిలో పనిచేసే అధికారులు మాత్రం పోటీకి అనర్హులని పేర్కొన్నారు.