18 ఏళ్లు దాటగానే.. గుర్తు చేస్తుంది..! - MicTv.in - Telugu News
mictv telugu

18 ఏళ్లు దాటగానే.. గుర్తు చేస్తుంది..!

November 28, 2017

18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా  కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న ప్రచారం చేయబోతోంది. స్కూల్‌కు వెళ్లే పోరగాళ్ల నుంచి పండు ముసలోల్ల దాకా అందరిని చేరువైన ఫేస్‌బుక్ ద్వారా ప్రచారాన్ని చేపట్టింది. ఈవిషయంపై ఫేస్‌బుక్ సంస్థతో కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పందం చేసుకుంది.

దీనిలో భాగంగా ఫేస్‌బుక్‌లో ఖాతా కలిగిన యువత 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటు హక్కు నమోదు చేసుకోవాలనే సందేశం.. సదరు ఖాతాదారుని ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌పై ప్రత్యక్షమవనుంది. అంటే మీకు బర్త్ డే విషెస్ తో పాటు.. ఓటరుగా మీపేరును నమోదు చేసుకోవాలనే సందేశం కూడా ఫేస్బుక్ మీకు పంపుతుంది. డిసెంబర్ 31వరకు ఈసందేశాలను కేంద్ర ఎన్నికల సంఘం ఫేస్‌బుక్ ద్వారా పంపనుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌తోపాటు 13 భాషల్లో ఈసందేశం రానుంది.

ఈ మెసేజ్‌లో ‘ ఇప్పుడే రిజస్టర్‌ చేసుకోండి’ అనే బటన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయగానే నేషనల్‌ ఓటర్స్‌ సర్వీసెస్‌ పోర్టల్‌కు అనుసంధానం అవుతుంది. అర్హత కలిగిన భారత పౌరులకు 2018, జనవరి 1 లోపు ఓటు హక్కు కల్పించాలనే ఉద్యేశ్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.