ఓటర్లందరూ నన్ను క్షమించండి.. రజత్ కుమార్ - MicTv.in - Telugu News
mictv telugu

ఓటర్లందరూ నన్ను క్షమించండి.. రజత్ కుమార్

December 8, 2018

తెలంగాణలో నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన ఆయన ఓటర్లకు క్షమాపణలు చెప్పారు. గతంలో జరిగిన ఐఆర్‌ఈ‌ఆర్‌లో పొరపాట్లు జరిగాయని, నిబంధనలు పాటించకుండా  ఓట్లు తొలగించడంతోనే ఈ సమస్య వచ్చిందన్నారు. జాబితాలో ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాలని ప్రచారం చేశామని ఆయన గుర్తు చేశారు. అలాగే గడిచిన రెండు నెలల్లో 25 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చామన్నారు.Telugu News Election commission Officer Rajath Kumar Say Sorry To Telangana Voters For Missing Votes in Assembly Electionsఅయితే ఓట్లను కోల్పోయిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, 26 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఉంటుందన్నారు. ఇప్పుడు జరిగిన పొరాపాట్లను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జరగకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.