ఫేస్‌బుక్‌కు ఎన్నికల విధులు… టాస్క్‌పోర్స్ ఏర్పాటు - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్‌కు ఎన్నికల విధులు… టాస్క్‌పోర్స్ ఏర్పాటు

October 7, 2018

ఎన్నికల వేడి ఫేస్‌బుక్‌కు తాకింది. ఆ వేడిలో ఎవరు ఎప్పుడు ఏ పార్టీ మీద విరుచుకుపడతారో తెలీదు. కొందరు అదేపనిగా నచ్చని పార్టీ మీద పౌరస్వేచ్ఛ అని పచ్చి కామెంట్లు చేస్తున్నారు. ఇది గమనించినట్టుంది ఫేస్‌బుక్. ఇలాంటివాటికి చెక్ పెట్టాలనుకుంది. ఫేస్‌బుక్ చేతిలో వుంది కదా అని విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా రాయడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టడం, వీడియోలు అప్‌లోడ్ చేయడం వంటివి చెల్లవంటోంది ఫేస్‌బుక్ యాజమాన్యం. ఎన్నికల సందర్భంగా ఫేసు‌బుక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు  ఫేస్‌బుక్‌ గ్లోబల్‌ పాలసీ సొల్యూషన్స్‌ ఉపాధ్యక్షుడు రిచర్డ్‌ అలన్‌ అన్నారు.

Election duty for Facebook ... set up taskforce

విద్వేష ప్రసంగాలు, వ్యాఖ్యలు వ్యాప్తి చెందకుండా, రాజకీయ నేతలు, ప్రజల మధ్య సత్సంబంధాలను ప్రోత్సహించేందుకు వీలుగా టాస్క్‌ఫోర్స్‌ను నియమిస్తామని వెల్లడించారు. భారత్‌ సహా చాలాదేశాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 20,000 మంది సిబ్బందిని నియమించుకుంటున్నట్టు తెలిపారు. కులం, జాతి, రంగు, పార్టీలు అంటూ విద్వేషపూరిత వ్యాఖ్యల కట్టడికి ఇదే మంచి ఉపాయం అని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.