బతుకమ్మ చీరలు పంచుకోండి.. ఈసీ గ్రీన్ సిగ్నల్ - MicTv.in - Telugu News
mictv telugu

బతుకమ్మ చీరలు పంచుకోండి.. ఈసీ గ్రీన్ సిగ్నల్

October 1, 2018

బతుకమ్మ పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం చీరల పంపిణీ చేయడానికి  ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. రైతు బంధు పథకం చెక్కులు కూడా పంపిణీ చేయొచ్చని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.గా రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి పలు కీలక అంశాలను వివరించారు. రైతు బంధు చెక్కుల పంపిణీకి.. బతుకమ్మ చీరల పంపిణీకి ఎన్నికల కోడ్ అడ్డురాదన్నారు. పథకాలు అమలు చేసేందుకు కొత్త నిబంధనలు ఏమీ ఉండవన్నారు.

Election Commission Grant Permission To Bathukamma Sarees Distribution In Telangana

‘రైతు బంధు, బతుకమ్మ చీరల పంపిణీపై వివిధ పార్టీల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సీఈసీకి పంపించాం. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు అన్నీ అనుకూలంగానే ఉన్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలీస్తే తెలంగాణలో పరిస్థితులు  చాలా బాగున్నాయి.. ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేస్తోంది. నియోజకవర్గం వారిగా ఓటర్ల లిస్టులను పరిశీలిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో 13శాతం ఓటర్లు పెరిగారు. ఒక్క భద్రాచలంలో 40శాతం ఓటర్లు తగ్గారు.  అశ్వారావుపేటలో 21శాతం ఓటర్లు తగ్గారు. ఫామ్ 6ద్వారా 19లక్షల 50 వేల కొత్త ఓటర్లు దరఖాస్తు చేశారు. లక్షా యాభై వేల ఓటర్లను రిజెక్ట్ చేశాం. 40శాతం కొత్త అప్లికేషన్లు ఉన్నాయి. ఇందులో 60శాతం పాతవి ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 4.16 లక్షల దివ్యాంగ ఓటర్ల కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు. వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి, క్యూ లేకుండా నేరుగా ఓటు వేసేలా చర్యలు చేపడుతున్నాం. అలాగే కళ్లు లేనివారికి బ్రెయిలీ లిపిలో ఓటర్ కార్డ్స్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు రజత్ కుమార్ తెలిపారు.