mictv telugu

నిలిచిపోయిన పంచాయతీల్లో 28న ఎన్నికలు

February 13, 2019

అనివార్య కారణాల వల్ల కొన్ని పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా, ఆ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన పంచాయతీలు, వార్డుల్లో ఈనెల 28వ తేదీన ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏడు పంచాయతీల్లోని మొత్తం వార్డులు, సర్పంచ్ పదవులు, ఆరు పంచాయతీల సర్పంచ్ పదవులు, వివిధ పంచాయతీల్లోని 246 వార్డు సభ్యుల పదవులు ఉంటాయి. ఈనెల 14 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఫలితాలను 28వ తేదీన ప్రకటిస్తారు. అదేరోజు ఉపసర్పంచ్ ఎన్నికలను చేపడతారు.

Telugu news Elections on 28 in the closed panchayats..

ఇదిలావుండగా ఎన్నికల్లో కోరం లేనందున 560 పంచాయతీల్లోని ఉప సర్పంచ్ పదవుల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. వాటి ఎన్నికలను ఈనెల 18న చేపట్టాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఆరోజున డీపీవోలు పంచాయతీ పాలకవర్గాలతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ఉపసర్పంచి ఎన్నికలను పూర్తి చేస్తారు. ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధజిల్లాల్లో ఎంపిక చేసిన జూనియర్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జిల కోర్టుల వివరాలను తెలిపింది ఎన్నికల సంఘం.Telugu news Elections on 28 in the closed panchayats