మహబూబ్‌నగర్ ఎలక్ట్రిక్ బస్సు అదుర్స్ - MicTv.in - Telugu News
mictv telugu

మహబూబ్‌నగర్ ఎలక్ట్రిక్ బస్సు అదుర్స్

December 16, 2017

ఈరోజుల్లో వాహనాల కాలుష్యం అంతా ఇంతా కాదు. ఏరోడ్డు చూసినా గాలిలో వాహనాల పొగతో నిండిపోతుంది. నిత్యం తిరిగే ఆర్టీసీ బస్సులు కూడా ఇందులో బాగమే. అయితే బస్సుల ద్వారా వెలువడే కాలుష్యానికి చెక్ పెట్టేందుకు గోల్డ్ స్టోన్ అనే కంపెనీ ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తుంది. మళ్లీ ఎక్కడోకాదు ఈ ఎలక్ట్రిక్ బస్సులను మహబూబ్ నగర్ జిల్లా జడ్ఛర్లలో తయారు చేస్తున్నారు. ఇంధన ఖర్చు ఉండదు, సౌండ్ ఉండదు.

ముఖ్యంగా పొగ కాలుష్యం అసలే కాదు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 300 కిలోమీటర్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుంది. 32 సీట్లున్న ఈ బస్సు విలువ దాదాపు రూ.2 కోట్లు. ఈమధ్యే ఓ బస్సుకు సామర్థ్య పరీక్షలు నిర్వహించిన మహబూబ్‌నగర్‌ రవాణాశాఖ అధికారులు అన్నిరకాల అనుమతులు మంజూరు చేశారు. ఇగ భవిష్యత్తులో అన్నీ ఇలా ఎలక్ట్రికల్ వాహనాలు వస్తే అసలు కాలుష్యం అనే ముచ్చటనే ఉండది కదా. కనీ ఆరోజులు ఇంకా రానీకి ఎన్నేండ్లు వడ్తదో….