బీజేపీ అభ్యర్థి ఇంట్లోనే ఈవీఎం.. అధికారి సస్పెండ్ - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీ అభ్యర్థి ఇంట్లోనే ఈవీఎం.. అధికారి సస్పెండ్

December 8, 2018

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఇంట్లో ఈవీఎం లభించింది. దీంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై వేటు పడింది. ఈ ఘటన రాజస్తాన్‌లోని పాలి నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇక్కడి బీజేపీ అభ్యర్థికి ఇంటికి విధుల్లో అధికారి రిజర్వ్‌లో ఉంచిన ఈవీఎంను తీసుకెళ్లినట్లు సమాచారం అందడంతో ఆ అధికారిని విధుల నుంచి తప్పించి, ఈవీఎంను పోలింగ్ ప్రక్రియకు దూరంగా ఉంచారు.Telugu News Electronic Voting Machine  Rajasthan Pali Constituency Bjp MLA Candidate Home విధులపట్ల నిర్లక్ష్యం వహించిన పాలి రిటర్నింగ్ అధికారి మహవీర్‌ను ఉన్నతాధికారులు బదిలీ చేశారు. ఆయన స్థానంలో జోధ్‌పూర్ నుంచి రాకేష్ అనే మరో అధికారికి బాధ్యతలు అప్పగించారు. బీజేపీ అభ్యర్థి ఇంట్లో ఖాళీగా ఉన్న ఈవీఎంకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.