ఏనుగు బస్సు ఆట ఆడుకుంది - MicTv.in - Telugu News
mictv telugu

ఏనుగు బస్సు ఆట ఆడుకుంది

December 11, 2017

చిన్న పిల్లలు  బొమ్మలతో , చిన్న చిన్న బొమ్మ బస్సులతో, రైళ్లతో ఆటాడుకుంటుంటారు. కానీ  చైనాలో ఓ ఏనుగుకు బస్సాట ఆడుకోవాలనిపించింది. మరింకే  ఎంచక్కా రోడ్డుపైకి వచ్చి కనిపించిన బస్సును ఓ ఆటాడింది. ముందుకు వెనక్కి తోస్తూ..ఆట మధ్యలో బస్సు అద్దాల్ని కూడా పలగ్గొట్టింది.

ఏనుగు ఆటాడుకున్న సమయంలో ఆ బస్సులో ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న డ్రైవర్  దాని ఆటను చూసి  పరుగెత్తాడు.  ఏనుగు ఆట బస్సుతో ఆగలేదు. బస్సుతో ఆడి ఆడి బోర్ కొట్టిందనుకుందేమో.. ఆ తర్వాత వెనకే ఉన్న ఇంకో ట్రక్కును అమాంతం కింద పడెయ్యాలని చూసింది. కానీ కుదరక పోవడంతో ఇక ఆడిన కాడికి చాల్లే అనుకుని మళ్లీ అడవిలోకి వెళ్లిపోయింది. ఈ తతంగం అంతా అక్కడున్న  సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది.