ఏనుగును హిప్నటైజ్ చేయబోయి మృత్యువాత..

క్రూరమృగాలు క్రూరంగానే ఉంటాయి. అవి పెంపుడు జంతువుల్లా చెప్పిన మాట వింటాయని భావించిన ఓ మనిషి నిండు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అడవిలో తన మానాన తాను గడ్డిమేస్తున్న ఏనుగు వద్దకు వెళ్లి, దాన్ని హిప్నటైజ్ చేయడానికి యత్నించి దాని బాదుడుకు విగతజీవిగా మారిపోయాడు. శ్రీలంకలోని కటరగమా అటవీ ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

హిప్నాటిజంలో తనను మించినవాడు లేడంటూ ఓ వ్యక్తి అడవిలోకి వెళ్లాడు. ఆ దృశ్యాన్నంతా రికార్డు చేయాలని మిత్రులకు చెప్పాడు. నేరుగా ఏనుగు వద్దకు వెళ్లాడు. దాని దృష్టిని ఆకర్షించాడు. గడ్డి మేస్తుంటే మధ్యలో నీ గోలేంటి అన్నట్లు ఆ మగగజం అతనిపైకి దూసుకొచ్చింది. అయినా అతడు బెదరకుండా హిప్నటైజ్ చేయబోయాడు. ఆ గజరాజు అతడు తనకేదో ఆపద తలపెడుతున్నాడని భావించి తొండంతో మోది చంపేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రూరమృగాలతో చెలగాడం ఆడకూడదని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Telugu news  Elephant tramples a man to death as he tried to HYPNOTISE it in Sri Lanka man tried to hypnotise an elephant in Kataragama