బాలుడి ప్రాణం తీసిన బొమ్మ - MicTv.in - Telugu News
mictv telugu

బాలుడి ప్రాణం తీసిన బొమ్మ

November 1, 2017

తల్లిదండ్రులు పిల్లల తిండి విషయంలో  జాగ్రత్తలు తీసుకోకపోతే చిన్నారులు చాలా సమస్యల్లో పడతారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఓ బాలుడు చిప్స్ ప్యాకెట్లో వచ్చిన ఆటబొమ్మను మింగి ప్రాణం కోల్పోయాడు.

ఈ ఉదంతం  కుమ్మరి రేవు కాలనీ చోటుచేసుకుంది. నాలుగేళ్ల  నిరీక్షణ్ కుమార్ బుధవారం ఉదయం అమ్మ దగ్గర రూ . 5 తీసుకుని చిప్స్ ప్యాకెట్ కొని తెచ్చుకున్నాడు. ఆ ప్యాకెట్‌లో  చిప్స్‌తో పాటుగా ఆడుకునే ఓ  ప్లాస్టిక్ బొమ్మ కూడా ఉంది. చిన్నారి చిప్స్ తింటూ  ఆ బొమ్మ కూడా చిప్స్ అనుకుని మింగాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో కిందపడి గిలగిల కొట్టుకున్నాడు. గమనించిన తల్లిదండ్రులు..  గొంతులో ఇరుక్కుపోయిన బొమ్మను తీసే ప్రయత్నం చేశారు. ఎంతకీ  రాకపోయేసరికి ఆసుపత్రికి తరలించారు.అప్పటికే బాలుడు ఊపిరి ఆడక చనిపోయాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.