9 కాదు 27 రసాలు.. - MicTv.in - Telugu News
mictv telugu

9 కాదు 27 రసాలు..

September 10, 2017

మనిషికి సంతోషం, అసహ్యం, భయం, ఆశ్చర్యం,  ఆగ్రహం, దు:ఖం, హస్యం, రౌద్రం తదితరభావోద్వేగాలు ఉంటాయని అనుకున్నాం. ఇలాంటి తొమ్మిది భావాలకు నవరసాలని పేరు. కానీ మనిషిభావోద్వేగాలు ఎన్నో రకాలుగా ఉంటాయని తాజాగా తేలింది. అమెరికాకు చెందిన కాలిఫోర్నియా బర్క్ లీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు 27 రకాల భావోద్వేగాలను మనిషి పలికిస్తారని పేర్కొన్నారు.శాస్త్రవేత్తలు తమ పరిశోధన కోసం  800 మందిపైగా స్త్రీ , పురుషుల మీదపరిశోధనలు చేశారు.

సుమారు రెండువేలకు పైగా వీడియో క్లిప్పింగులను వారికి చూపించారు.ఆ వీడియోను వారికి చూపించినప్పుడు, ఒక్కొక్కరు వేరురేరుభావోద్వేగాలను చూపించారు.శాస్త్రవేత్తలు తర్వాత బహుముఖ పరస్పర ప్రతిస్పందనల పటాన్ని రూపొందించారు.ఒక్కొక్క వీడియోకు ఒక్కొక్కరు విభిన్నంగాఎవరు ఎలా స్పందించారు? అన్న విషయాలను అందులో స్పష్టంగా పేర్కొన్నారు. వీటిన్నింటిని కూడా ఆ పటంలో వివిధ రంగులలో స్పష్టంగా చూపారు. అంతేకాదు ఒక్కొక్క వీడియోకు ఎలా స్పందించారన్న అంశంపై లోతైనా విశ్లేషణలోవిభిన్నమైన 27 రకాల భావోద్వేగాలను గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.