నటి అమీ జాక్సన్ పెళ్లి ఫిక్సయింది.. - MicTv.in - Telugu News
mictv telugu

నటి అమీ జాక్సన్ పెళ్లి ఫిక్సయింది..

February 21, 2018

బహుభాషా నటి అమీ జాక్సన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనుంది.  బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జితో అమీ చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతోంది.  ప్రేమికుల రోజున అమీ.. తన ప్రియుడికి విష్‌ చేస్తూ ఫొటో పోస్ట్‌ చేయడంతో ఆమె ప్రేమ విషయం అందరికీ తెలిసింది. అమీ స్వదేశమైన  బ్రిటన్‌ వెళ్లిన ప్రతీసారి తన ప్రియుడితోనే  గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే వీరిద్దరూ పెళ్లిచేసుకోబోతున్నట్లు  సన్నిహితులు చెబుతున్నారు. వీరిద్దరి వివాహం  గతేడాదే  జరగాల్సి ఉంది.  కానీ  అమీ సినిమాలతో బిజీగా ఉండడంతో పెళ్లిని వాయిదా వేసినట్లు సమాచారం. అమీ 2010లో వచ్చిన ‘మద్రాసపట్టణం’ చిత్రంతో  చిత్ర పరిశ్రమలోని అడుగెట్టింది.ఆ తరువాత బాలీవుడ్‌లో వచ్చిన ‘ఏక్‌ దివానా థా’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వచ్చిన ‘ఏ మాయ చేశావె’ సినిమాకు ఇది రీమేక్‌గా వచ్చింది. ఆ తరువాత ‘సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌’, ‘ఎవడు’, ‘ఐ’ తదితర చిత్రాల్లో నటించింది. రజనీకాంత్‌, అమీ జాక్సన్‌ జంటగా నటించిన ‘2.0’ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.