ఇకపై కనీస పెన్షన్ రూ. 2000 - MicTv.in - Telugu News
mictv telugu

ఇకపై కనీస పెన్షన్ రూ. 2000

March 16, 2018

కేంద్ర సర్కార్ ఉద్యోగుల పెన్షన్ స్కీమ్‌ పరిధిలో వున్న వారికి ఓ శుభవార్తను వినిపించింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ( ఈపీఎఫ్‌వో ) నిర్వహిస్తున్న పెన్షన్ స్కీమ్‌లో ప్రస్తుతం నెలవారీ కనీస పింఛను రూ.1,000 ఉంది. దీనిని మోదీ ప్రభుత్వం రూ. 2000 చేయనుందని ప్రభుత్వ వర్గాల సమాచారం.  ప్రస్తుతం కనీసం రూ.1,000 పింఛను ఇవ్వడం వల్ల ఈపీఎఫ్‌వో సంస్థకు ఏర్పడుతున్న లోటును పూడ్చటానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. దీనివల్ల 40 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ప్రభుత్వంపై ఏటా రూ.3,000 కోట్ల భారం పడుతుందని చెప్పారు.పెన్షన్‌ను రెట్టింపు చేస్తే మరింత అధికంగా నిధుల భారాన్ని మోయాల్సి వస్తుంది. ఇదిలా వుండగా కనీస పింఛన్‌ను రూ.3,000 నుంచి రూ.7,000 వరకు పెంచాలని కార్మిక సంఘాలు, పెన్షనర్ల సంఘాల నుంచి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నట్టు పేర్కొన్నారు.