ఉద్యోగులు ఫార్మల్ దుస్తుల్లోనే విధులకు రావాలి.. ఐటీశాఖ - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగులు ఫార్మల్ దుస్తుల్లోనే విధులకు రావాలి.. ఐటీశాఖ

April 19, 2018

ఇంటి దగ్గర ఎన్ని ఫ్యాషన్ దుస్తులు వేసుకున్నా ఆఫీసుకు వస్తే ఫార్మల్ దుస్తుల్లో రావాలని ఢిల్లీ ఐటీ శాఖ నిబంధనలు విధించింది. దీంతో ఆదాయపన్ను శాఖ ఉద్యోగులు ఇకపై డ్రెస్‌కోడ్‌లో కనిపించనున్నారు. ఢిల్లీ ఐటీ శాఖ కమీషనర్ చీఫ్ ప్రిన్సిపల్ సిబ్బందికి డ్రెస్‌కోడ్‌పై పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. యువ ఉద్యోగులు జీన్స్, టీషర్ట్‌లు వేసుకుని రావటాన్ని తమ ఆదేశాల్లో తప్పు పట్టింది. ఇకపై అలాంటి డ్రెస్‌కోడ్‌ను అనుమతించేది లేదని స్పష్టం చేసింది.సిబ్బంది ఫార్మల్ దుస్తుల్లోనే హుందాగా విధులకు హాజరు కావాలని వివరించింది. ఈ ఆదేశాలను పాటించని ఉద్యోగులను హుందాగా ఇంటికి పంపించి, నిబంధనలకు అనుగుణమైన దుస్తుల్లో రావాలని సూచిస్తామని ఈ ఆదేశాల్లో స్పష్టం చేసింది. తమ కార్యాలయాల్లో హుందాగా వ్యవహరించే సిబ్బందితో ఉన్నత ప్రమాణాలు కలిగిన పని వాతావరణం నెలకొనాలని ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపింది. ఇకపై ఫ్యాషన్‌ దుస్తులు, పార్టీవేర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం తెలిపింది.