ఈ రోజు ఫిబ్రవరి 14.. ప్రేమికుల దినోత్సవం.. లవర్స్‌కి ఈరోజు పండుగే. ప్రేమించిన వ్యక్తితో సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్బులు అంటూ పక్షుల్లా జాలీగా విహరిస్తుంటారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం ఈ రోజు జరిగే హంగామా అంతగా ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే భజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ నాయకుల భయానికి ప్రేమ పక్షులన్ని గూట్లలోనే ఉండి….చేతిలో ఉన్న మొబైళ్లలో మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
#WATCH: Bajrang Dal members create ruckus at Hyderabad's Manjeera Mall on #ValentinesDay pic.twitter.com/QnbtQqfkb7
— ANI (@ANI) February 14, 2018
ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ భజరంగదళ్,విశ్వహిందూ పరిషత్ నాయకులు నెక్సెస్ రోడ్, సంజీవయ్య పార్క్‌ల చుట్టూ పోస్టర్లు అంటించారు. ఎవరైనా ప్రేమికులు కనిపిస్తే అక్కడికక్కడే పెండ్లి చేస్తామని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.
దీనితో దొంగ ప్రేమికులకు మరియు నిజమైన ప్రేమికులకు గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ప్రేమ పక్షుల్లా విహరిస్తున్న మాకు ఎక్కడ పెండ్లైపోతుందో. ఇంట్లోొ వాళ్లకు తెలిస్తే ఎంత గొడవవుతుందో అని భయపడ్డారు. దీనితో పార్కులు, ప్రేమికుల స్పాట్ లు నిర్మానుషంగా మారాయి.
ఇక ప్రేమికులను ఆకట్టుకోవడానికి కొన్ని షాపింగ్ మాల్స్ , బేకరీలు లవ్ బెలూన్స్ , ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెబుతూ షాపింగులను అలంకరించారు. అయితే భజరంగ్ దళ్ నాయకులు కూకట్ పల్లిలోొ ఉన్న మంజీరా మాల్ ఇంకా కొన్ని షాపింగ్ లపై దాడి చేశారు. లవ్ బెలూన్లను పగలగొడుతూ, గ్రీటింగ్ లను చింపేస్తూ నానా హంగామా చేశారు.
ప్రేమికులెవరైనా కంటపడితే పెళ్లి చేయాలని కూడా చూశారు. అయితే వీరు చేసిన హంగామాపై కొందరు మండిపడుతున్నారు. ప్రేమకు చిహ్నంగా జరుపుకునే ప్రేమికుల దినోత్సవాన్ని కొందరు భయపెట్టి దానిని జరుపుకోకుండా చేస్తున్నారని అంటున్నారు. అయితే హైదరాబాద్ లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పార్కుల దగ్గర, షాపింగ్ మాల్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు.