నామినేషన్ల ప్రక్రియకు ముగింపు… రికార్డు స్థాయిలో 3,584…

అటు అభ్యర్థుల జాబితా.. ఇటు నామినేషన్ల పర్వం. చివరివరకు చాలా ఉత్కంఠగా సాగింది వ్యవహారం. ఎట్టకేలకు నిన్నటితో నామినేషన్ల పర్వం ముగిసింది. తెలంగాణ రాష్ట్రం ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ నామినేషన్ల ప్రక్రియ గందరగోళ స్థితుల మధ్య సాగింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3,584 నామినేషన్లు దాఖలైనట్టు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఈనెల 12 నుంచి 19 వరకు సాగాయి నామినేషన్లు. సోమవారం చివరి రోజు అవడంతో ఆరోజు ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,087 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రెండు రోజుల్లోనే పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు అభ్యర్థులు. టికెట్లు రానివారు 19న స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ఈ నామినేషన్లలో స్వతంత్రులు, ఇతరులవే ఎక్కువగా వుండటం విశేషం. రాష్ట్రంలో మొత్తం 2,80,64,683 మంది ఓటర్లు ఉండగా, 9 పార్టీల అభ్యర్థులే గాక ఇతరులు, స్వతంత్రులు కూడా బరిలోకి దిగుతున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 15 స్థానాల నుంచి  617 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.Telugu news End of nomination process … At record level 3,584 …ఆయా పార్టీలు వేసిన నామినేషన్లు….

కాంగ్రెస్ 135

బీజేపీ 128

టీఆర్ఎస్ 116

టీడీపీ 20

ఎంఐఎం 13

సీపీఎం 28

సీపీఐ 3

ఎన్‌సీపీ 21

బీఎస్పీ 112

స్వతంత్రులు, ఇతరులు 1,511

హైదరాబాద్‌లో ఆయా స్థానాల నుంచి వచ్చిన నామినేషన్లు ఇలా…

అంబర్‌పేట 56

చార్మినార్‌ 25

ముషీరాబాద్ 48

మలక్‌పేట 36

బహదూర్‌పురా 19

చాంద్రాయణగుట్ట 34

ఖైరతాబాద్‌ 55

జూబ్లీహిల్స్‌ 51

సనత్‌నగర్‌ 37

గోషామహల్‌ 43

నాంపల్లి 42

కార్వాన్‌ 31

యాకత్‌పురా 37

సికింద్రాబాద్‌ 56

కంటోన్మెంట్ 47

దాఖలైన మొత్తం నామినేషన్లను నేడు పరిశీలించనున్నారు అధికారులు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని తిరస్కరించనున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులతో కూడిన బ్యాలెట్‌ను అధికారులు ప్రకటిస్తారు.  

ఇప్పటి వరకు  ఆరు రాజకీయ పార్టీలకు చెందిన మేనిఫెస్టోలు తమకు అందినట్టు తెలిపారు.