ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు - MicTv.in - Telugu News
mictv telugu

ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

December 14, 2017

గరంగరంగా గుజరాత్ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సైతం క్యూలో నిలబడి ఓట్లు వేశారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 సీట్లు ఉన్నాయి. మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. తొలి విడతలో 89 స్థానాలకు, రెండో విడతలో 14 జిల్లాల్లోని 93 స్థానాలకు పోలింగ్ ముగిసింది. మొత్తంగా 63 శాతం పోలింగ్ నమోదైంది. ఫలితాలు ఈనెల 18న తెలియనున్నాయి.కాగా ఈ నెల 18న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రెండో విడతలో పోలింగ్ జరిగిన 93 స్థానాలకు 851 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  పోలీసుల గట్టి బందోబస్తు నడుమ మొత్తం 2.22 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ 109, కాంగ్రెస్ 70 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందనున్నట్టు టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ప్రకటించింది. బీజేపీయే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్టు తెలిపింది.