mictv telugu

గే అయితే  తప్పేంటి? జో రూట్ దిమ్మదిరిగే కౌంటర్

February 12, 2019

ఇంగ్లండ్ – వెస్టిండీస్ మూడో టెస్ట్ మ్యాచ్‌ జరుగుతోంది.  ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెస్టిండీస్ బౌలర్ షానన్ గాబ్రియెల్ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో అంపెర్లు అతనికి ఫీల్డ్‌లోనే వార్నింగ్ ఇచ్చారు. అయితే గాబ్రియెల్ ఏమన్నాడో మైక్‌లో రికార్డు కాకపోయినప్పటికీ, జో రూట్ మాత్రం ‘గే’ అయితే తప్పేంటి అని సమాధానమిస్తున్న వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీనిపై స్పందించిన రూట్ మాట్లాడుతూ.. గాబ్రియెల్ ఏమన్నాడో చెప్పకపోయినా.. ‘ అతడు తన వ్యాఖ్యలకు చింతిస్తాడు. ఆన్‌ఫీల్డ్‌లో ఇలాంటివి సహజమే. వాటిని ఫీల్డ్‌కే పరిమితం చేయాలి. ఇది టెస్ట్ క్రికెట్. అతను ఈ మ్యాచ్ గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. అతనో మంచి మనిషి. హార్డ్ వర్క్ చేస్తాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పని అనిపిస్తే, అతనే క్షమాపణలు చెప్పాలి. ఈ ఘటనపై అంపైర్లకు కూడా ఫిర్యాదు చేయలేదు’ అని తెలిపాడు. దీనిపై వెస్టిండీస్ కోచ్ రిచర్డ్ పైబస్ స్పందించాడు. గాబ్రియెల్ ఏమన్నాడో తెలియదుగానీ.. తప్పు చేసినట్లు తెలిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాడు.Telugu News England In West Indies Shannon Gabriel Warned For Incident With Joe Root