నా శవంపైనా కాంగ్రెస్ జెండానే వుంటుంది - MicTv.in - Telugu News
mictv telugu

నా శవంపైనా కాంగ్రెస్ జెండానే వుంటుంది

November 29, 2017

‘ నేను పార్టీ మారుతున్నానన్నది పచ్చి అబద్ధం ’ అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. ‘ అవన్నీ నామీద ఎవరో పని గట్టుకొని ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు. అలాంటి తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దు. నేను చచ్చిపోయినా నామీద కాంగ్రెస్ జెండానే వుంటుంది ’ అని స్పష్టం చేశారు.

‘ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదు. తెలంగాణ ప్రజలను మోసం చేశారు. దళితుడిని సీఎంని చేస్తానన్న కేసీఆర్ హామీ గంగలో కొట్టుకుపోయింది. ఇలాంటి నేతకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలి. బడుగు, బటహీన వర్గాలకు, రైతులకు, పేదలకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా నిలిచింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి’ అని అన్నారు  కోమటిరెడ్డి.