ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కనాలి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కనాలి

November 25, 2017

హరిద్వార్ పీఠాధిపతి స్వామీ గోవింద్ దేవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి.  ‘ఇద్దరు పిల్లల విధానం వల్ల భారతదేశంలో హిందువుల సంఖ్య తగ్గుపోతోందని, అందుకే ప్రతి హిందువు నలుగురు పిల్లల్ని కనాలని’ ఆయన అన్నారు.

దేశంలో ఎక్కడైతే హిందువుల జనాభా తగ్గిందో ఆ ప్రాంతాన్ని భారత్‌ కోల్పోయిందని, ఇందుకు జనాభా అసమతుల్యతే కారణమని, దేశంలో కామన్ సివిల్ కోడ్ అమల్లోకి వచ్చేవరకకు హిందువులు పిల్లల్ని కనాలని ఆయన అన్నారు.  కర్నాటకలోని ఉడిపి క్షేత్రంలో విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్మ సన్సద్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.