మహిళలపై దాడులకు నిరసనగా విశాఖపట్నంలో వైకాపా ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి లక్ష్మీపార్వతి హాజరై ప్రసంగించారు. ‘విశాఖలో రోజురోజుకూ భూకబ్జాలు, రౌడీయిజం పెరిగిపోతున్నాయి. భూకబ్జాల వ్యవహారంలో తూతూ మంత్రంగానే కమిటీ వేశారు. దాని వూసే లేకుండా పోయింది. పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి కొమ్ము కాస్తోంది. మహిళలపై దాడులను అరికట్టడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైంది’ అని ామె మండిపడ్డారు.అందాల పోటీలకు నిరసనగా ఆందోళన చేపట్టిన మహిళలను దారుణంగా కొట్టారని వాపోయారు.
ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు హస్తగతం చేసుకుని పార్టీని పూర్తిగా నాశనం చేశారన్నారు. రోడ్లపై మానభంగాలు, రౌడీ రాజకీయాలు ఇదేనా టీడీపీ ప్రభుత్వ విధానం? అని ప్రశ్నించారు.