టీడీపీకి సీతక్క రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

టీడీపీకి సీతక్క రాజీనామా

October 31, 2017

ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క టీడీపీకి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం ఫ్యాక్స్‌లో రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ఆమె దిల్లీ చేరుకున్నారు.

నేడు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఆమె, రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తెదేపాకు రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డి ఈమధ్యాహ్నం తన అనుచరులతో కలిసి ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రయోజనాలకోసమే తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు రేవంత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.