మోదీకి బెడిసికొట్టింది.. మన్మోహన్ ఘాటు కౌంటర్ - MicTv.in - Telugu News
mictv telugu

మోదీకి బెడిసికొట్టింది.. మన్మోహన్ ఘాటు కౌంటర్

April 18, 2018

ఒక్కోసారి మనం ఎదుటివాళ్ళకు ఉచిత సలహాలు ఇస్తుంటాం. తాడే పామై కరుస్తుందన్నట్టు మనం ఇచ్చిన ఉచిత సలహాలను మనకు కొందరు ఇచ్చి గట్టి కౌంటర్ ఇస్తారు. అది అక్షరాలా ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో నిజమైంది. ఇప్పుడు మోడీకి ఆయన సలహాలను ఆయనకే ఇస్తోంది వేరెవరో కాదు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. చిలకకు పాఠం నేర్పిస్తే తిరిగి అది మనకు అప్పజెప్పినట్టే వుంది పరిస్థితి చూస్తుంటే.ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. ‘ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్ర మోడీ నన్ను ‘మౌన్-మోహన్ సింగ్’ అనేవారు. నన్ను మోడీ విమర్శిస్తున్నట్లు నాకు మీడియా ద్వారా తెలిసేది. మరి ఇప్పుడు ఆయన మౌనమోడీలా ఎలా వున్నారు ? అప్పుడు నాకిచ్చిన సలహాను ఆయనిప్పుడు పాటించవచ్చు కదా.  కఠువా, ఉన్నావ్ అత్యాచారాలపై దేశంలో ఇంతలా ఇసుక ఉడుకుతుంటే ఆయన నిమ్మకు నీరెత్తినట్టు నోరు మూసుకుని మౌనం పాటిస్తే ఏమనుకోవాలి ? ’ అని ధ్వజమెత్తారు.

కాగా గత శుక్రవారం ప్రధాని స్పందించటం హర్షణీయం అన్నారు మన్మోహన్. బారత బిడ్డలకు న్యాయం జరుగుతుందని, నేరస్థులకు శిక్ష పడుతుందని అన్నారు సంతోషం అని తెలిపారు.  ఈ స్పందన ముందే వుండుంటే నేరస్థులు తమపై కఠిన చర్యలు లేకుండా తప్పించుకోవచ్చిన జనాలు అనుకునే అవకాశం వుండేది కాదు. అధికారంలో వున్నవాళ్ళు తప్పినిసరిగా సకాలంలో స్పందించాలి లేకపోతే జనాల్లో  ఒక అపప్రథ ఏర్పడుతుంది.