mictv telugu

టీడీపీలో చేరుతున్నా.. మాజీ కేంద్రమంత్రి

February 12, 2019

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాల పార్టీల్లో చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా మాజీ కేంద్రమంత్రి, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశానని, త్వరలో టీడీపీ పార్టీలో చేరతానని ప్రకటించారు. రాష్ట్రానికి టీడీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం బాబుతో భేటీలో ప్రస్తావనకు రాలేదని కిశోర్‌ చెప్పారు.Telugu News ex union minister, congress senior leader kishore chandra dev to join telugu desam partyఆయన ఇటీవల విజయనగరం జిల్లా కురుపాంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు అప్పుడే ప్రకటించారు. దీంతో కిశోర్ చంద్రదేవ్‌‌ టీడీపీలో చేరనున్నారని ప్రచారం జోరుగా జరిగింది. తాజాగా ఆయనే స్వయంగా ప్రకటించి ఊహాగానాలకు ముగింపు ఇచ్చారు. కిశోర్‌ చంద్రదేవ్‌ అరకు పార్లమెంట్‌ స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.