దొంగల భీభత్సం.. కోటి విలువగల సెల్‌ఫోన్లు చోరీ.. - MicTv.in - Telugu News
mictv telugu

దొంగల భీభత్సం.. కోటి విలువగల సెల్‌ఫోన్లు చోరీ..

January 9, 2019

జగిత్యాల జిల్లాలో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. కోటి రూపాయల విలువగల ఫోన్లు దొంగిలించారు. పట్టణంలోని యావర్‌ రోడ్డులోని ఉన్న భవాని, లాట్‌ మొబైల్‌ దుకాణాల్లో వేకువజామును చొరబడ్డారు. బొలేరో వాహనంలో వచ్చిన నలుగురు దుండగులు ముఖాలు గుర్తుపట్టరాకుండా కర్చీప్‌లు కట్టుకున్నారు. స్వెటర్ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. కోటి రూపాయల విలువైన సెల్‌ఫోన్లను, దుకాణాల్లో వున్న రూ. 6 లక్షల నగదును దోచుకెళ్ళారు. దుండగులు మరికొన్ని దుకాణాల్లోనూ చోరీకి విఫలయత్నం చేశారు.

ఈ దృశ్యాలన్నీ సెల్‌ఫోన్ దుకాణంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగల ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.telugu news Explosive thieves broke out in the Jagityala district .. Cell phones worth Rs. 1 crore