తిరుమల మెట్లదారిలో కలకలం.. భారీగా పేలుడు పదార్థాలు - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమల మెట్లదారిలో కలకలం.. భారీగా పేలుడు పదార్థాలు

January 30, 2018

ఉగ్రవాదుల హిట్‌లిస్టులో వున్న ప్రముఖ పుణ్యక్షేతం్ర తిరుమలలో పేలుడు పదార్థాలు లభ్యమవడం భక్తుల్లో తీవ్ర కలకలానికి దారి తీసింది. కట్టుదిట్టమైన భద్రత వుండే తిరుమల దారిలో ఇవి లభ్యం కావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్రమత్తమై ఆరా తీస్తున్నారు. అసలు ఈ ప్రాంతంలోకి పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి, అసాంఘిక శక్తులెవరైనా వీటిని తీసుకొచ్చి వదిలి వెళ్ళారనే కోణంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.  

 

 

పోలీసుల సోదాల్లో పేలుడు పదార్ధాల తయారీకి ఉపయోగించే సర్క్యూట్ బోర్డులు, కెపాసిటర్లు, కండెన్సర్లు లభ్యమయ్యాయి. దుండగులు వీటిని ఎక్కడికి తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి చాలా ప్రమాదకరమైన పదార్థాలు కావడం, గతంలో అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి జరగడంతో పోలీసులు మరింత నిఘా పెంచారు.

ఐజీ కాంతారావు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అలిపిరి వద్ద గతంలో చంద్రబాబు నాయుడిపై మావోయిస్టుల దాడి నేపథ్యంలో కాలిబాటతోపాటు తిరుమల, తిరుపతి అంతటా గట్టి భద్రత ఉన్నా పేలుడు పదార్థాలు దొరకడం సంచలం సృష్టిస్తోంది.