ఫ్రెండ్స్ మెసేజీలను ఇక మిస్సయ్యే చాన్స్ లేదు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్రెండ్స్ మెసేజీలను ఇక మిస్సయ్యే చాన్స్ లేదు..

November 24, 2017

స్నేహితులకు  మెసేజ్‌లు పంపడంలో ఫేస్ బుక్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. మనం స్నేహితులకు పంపే మెసేజ్ లను వారు బిజీగా ఉండి ఒకోసారి చూడకపోవచ్చు. అయితే వారు చూడకున్నా ఆ మెసేజ్ తాలూకు సింబల్ మూడు రోజుల దాకా మీ స్నేహితుడిని మెసేజ్ వచ్చిందని  అలర్ట్ చేస్తూనే ఉంటుంది. ఎన్ని రోజులు నుంచి మెసేజ్‌లు వస్తున్నాయో  కూడా తెలుపుతుంది.  ఈ మధ్యకాలంలో స్నాప్‌చాట్ ‘స్ట్రీక్స్’ యువతను బాగా ఆకర్షించింది. దానికంటే  ఎక్కువగా ఆకట్టుకునేలా  ఫేస్‌బుక్‌లో ఈ ఫీచర్ అభివృద్ది చేస్తున్నట్లు  ఫేస్‌బుక్ సంస్థ ప్రకటించింది.