ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్‌.. క్లిక్ టు వాట్సాప్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్‌.. క్లిక్ టు వాట్సాప్

December 15, 2017

ఫేస్‌బుక్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాని పేరు ‘ క్లిక్ టు వాట్సాప్ ’.  గతేడాది నవంబర్‌లో ప్రారంభమైన క్లిక్ టు మెసెంజర్ మాదిరే దీన్ని అందుబాటులోకి తెచ్చింది ఫేస్‌బుక్. దీని ద్వారా మరింత మంది యూజర్లను తమ సొంతం చేసుకోవచ్చు. 100 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్లను  అడ్వర్‌టైజర్లు కనెక్ట్‌ చేసుకోవచ్చు.

శుక్రవారం ఈ విషయాన్ని టెక్‌క్రంచ్‌ ద్వారా ఫేస్‌బుక్‌ ధృవీకరించింది.  ఇది చాలా వేగవంతమైనదని, యూజర్లతో టచ్‌లో ఉండటానికి ఇది అనువైన మార్గమమని ఫేస్‌బుక్‌ ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ పంచమ్‌ గజ్జర్‌ చెప్పారు.

ఫేస్‌బుక్‌ ప్రకటనల కోసం క్లిక్‌-టు-వాట్సాప్‌ బటన్‌ను యాడ్‌ చేయడం ద్వారా, వ్యాపారస్తులు తమ ఉత్పత్తులను చాలా త్వరగా ప్రజలకు చేరవేయడానికి ఉపయోగపడుతుందంటున్నారు. చిన్న చిన్న వ్యాపారాలతో కమ్యూనికేట్‌ అవడానికి చాలా మంది వాట్సాప్‌ను వాడుతున్నారు. దాన్ని మరింత విస్తృతం చేసుకోవడానికి ఈ కొత్త ఫీచర్ ఉపయుక్తంగా వుంటందని చెప్తున్నారు.  ప్రస్తుతం 10 లక్షల పేజీలు, వాట్సాప్‌ నెంబర్లను తమ పోస్టులకు జతచేర్చాయి.

ఈ ఫీచర్‌ను క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్టు కూడా తెలిపింది. ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియాలో పలు ప్రాంతాల్లో తొలుత దీన్ని ప్రారంభించింది. యూజర్లు ఉత్పత్తుల గురించి సంభాషణ జరుపడానికి తమ కాంటాక్ట్స్‌లో వ్యాపారస్తుల వాట్సాప్‌ నెంబర్లను యాడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.