ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్

November 21, 2017

ఫేస్‌బుక్  వినియోగదారులకు తీసి కబురు. త్వరలోనే  ఫేస్‌బుక్ మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాచ్(wacth) పేరిట వీడియో స్ట్రీమింగ్ ఫీచర్‌ను త్వరలోనే ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు లైవ్ వీడియోలు, స్పోర్ట్స్, సినిమాలు, టీవీ షోలు చూడొచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ అమెరికాలో ఫేస్‌బుక్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను త్వరలోనే భారత్‌లోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.ఈ ఏడాది జూలై వరకు నమోదు అయిన ఫేస్‌బుక్ లెక్కల ప్రకారం ఫేస్‌బుక్‌‌ను 240 కోట్ల మంది వాడుతున్నారు. ఈ క్రమంలోనే  భారీ మార్కెట్ ఉన్నందున ఫేస్‌బుక్ వీడియో స్ట్రీమింగ్ సేవలను ప్రవేశపెడుతుంది.  వినియోగదారులకు బాగా నచ్చే వీడియోలు,షోలను స్ట్రీమింగ్ సేవల ద్వారా అందించనుంది. లైవ్ స్టైల్, కామెడీ, చిల్డ్రన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి వివిధ జానర్‌లకు సంబంధించిన వీడియోలను స్ట్రీమింగ్ సేవల ద్వారా అందించాలనే ఉద్దేశంతో ఫేస్‌‌బుక్ ఉంది. అయితే ఈ సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో అన్నది ఫేస్‌బుక్ తెలిపలేదు.కానీ త్వరలోనే అందుబాటులోకి రానుట్టు సమాచారం.