గతంలోనే డేటా విక్రయించాలని ప్రయత్నించిన ఫేస్‌బుక్

ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌ డేటా విక్రయం అంశం గత సంవత్సరం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం కొన్నేళ్ల క్రితమే వినియోగదారుల సమాచారాన్ని విక్రయించే అంశం గురించి ఫేస్‌బుక్ ఆలోచించిందని, కానీ తర్వాత దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. 2012లోనే ఫేస్‌బుక్‌ సిబ్బంది కనీసం 2,50,000 డాలర్లకు యూజర్ల ప్రాథమిక వివరాలను ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని భావించారని ఆ నివేదిక పేర్కొంది.

పోలియో బాధిత బాలుడికి కేటీఆర్ భరోసా

కానీ, 2014లో ఫేస్‌బుక్‌ తన నిర్ణయాన్ని మార్చుకుందని తెలిపింది. ఫేస్‌బుక్‌ ఆ తర్వాత వినియోగదారులకు చెందిన కొంత సమాచారాన్ని ఉపయోగించుకోకుండా పరిమితులు విధించిందని, 2015 జూన్‌ నాటికి పాత వెర్షెన్‌లో ఇచ్చిన అనుమతులను అన్నీంటిని తొలగించేసిందని నివేదిక వెల్లడించింది. యూజర్ల సమాచారాన్ని ఉపయోగించుకునేందుకు మరికొన్ని అనుమతులు పెంచుతూ ప్రకటన కర్తల నుంచి మరి కొంత రాబడి పొందవచ్చనే అంశంపై ఫేస్‌బుక్‌ ఉద్యోగులు చర్చలు జరిపారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కూడా ఓ కథనంలో పేర్కొంది. అమెరికాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఫేస్‌బుక్‌పై ఒప్పంద ఉల్లంఘన కేసు నమోదు చేయగా.. ఫేస్‌బుక్‌కు చెందిన కొన్ని అంతర్గత పత్రాలు బయటకు రావడంతో విషయం వెలుగు చూసినట్లు సమాచారం.

Telugu News Facebook planned to sell users' data in 2012 Report says