దుర్మార్గుల్లారా..చిన్నపిల్లల వ్యాక్సిన్లను కల్తీ చేయడమేందిరా.. - MicTv.in - Telugu News
mictv telugu

దుర్మార్గుల్లారా..చిన్నపిల్లల వ్యాక్సిన్లను కల్తీ చేయడమేందిరా..

January 30, 2018

కల్తీ..కల్తీ..కల్తీ.. మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాక ఏది చూసినా ఏది తిన్నా అంతా కల్తే. తినే ఆహారం నుంచి రోగం వస్తే ఏసుకునే మందుల దాకా అంతా కల్తే. కల్తీ యుగంలో బ్రతుకుతున్న మనకు కల్తీ అనేది మన అందరి జీవితంలో ఓ భాగమైపోయింది. స్వచ్చమైన మనుషులం కాస్త నకిలీ తిండి తిని,నకిలీ మందులు వేసుకుని నకిలీ మనుష్యులుగా తయారవుతున్నాం.

ఇప్పుడు ఈ కల్తీ బూతం చిన్నపిల్లలకు వేసే వ్యాక్సిన్ల దాకా వచ్చింది. నకిలీ వ్యాక్సిన్లను తయారు చేసే ముఠాను హైదరాబాద్ లోని అంబర్ పేటలో నార్త్‌ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నకిలీ వ్యాక్సిన్లను ప్రభుత్వానికే విక్రయిస్తుంది ఈ ముఠా. చిన్నపిల్లలకు ఇచ్చే టెటనస్ వ్యాక్సిన్ ని రీసైకిల్ చేసి..కాలం చెల్లిన వ్యాక్సిన్‌ని కొత్త వ్యాక్సిన్ గా తయారు చేసి దానిపై కొత్త డేట్ వేసి ప్రభుత్వానికే అమ్ముతున్నారు. అంబర్ పేటలో ఉన్న కర్మాగారాన్ని పోలీసులు సోదా చేస్తే లక్షల్లో నకిలీ వ్యాక్సిన్లు బయటపడ్డాయి. వారిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులను రిమాండుకు పంపారు.

చిన్నపిల్లలకు భవిష్యత్తులో ఏ వ్యాధి సోకకుండా..చిన్నప్పటినుండే పలు వ్యాక్సిన్లను ఏపిస్తారు తల్లిదండ్రులు కానీ వాటిని కూడా నకిలీ చేస్తే ఎలా? నెలల కూడా నిండని పసిగుడ్డులకు నకిలీ వ్యాక్సిన్లు ఇస్తే..దానివల్ల వచ్చే ఎఫెక్టులను పాపం వాళ్లెలా తట్టుకుంటారు?పలకడానికి నోట్లో నుంచి మాటకూడా రాదు కదా. అందుకనే ఈలాంటి దుర్మార్గులను అస్సలు వద్దలద్దు. పోలీసులు మరింత చొరవ తీసుకుని ఇలాంటి నకిలీ కర్మాగారాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లల వ్యాక్సిన్లను కూడా వదలని ఈకల్తీగాళ్లను కఠినంగా శిక్షించాలి.