ఇవాంకా,మోదీల కోసం నిజాం నవాబుల తిండి - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకా,మోదీల కోసం నిజాం నవాబుల తిండి

November 28, 2017

ప్రపంచ సదస్సుకు వచ్చిన అతిథిల కోసం ఫలక్‌నామా ప్యాలెస్‌లో తెలంగాణ ప్రభుత్వం రుచికరమైన వంటకాలను సిద్ధం చేసింది. 108 అడుగుల పొడవైన డైనింగ్ టేబుల్‌పైన నోరూరించే వంటకాలు సిద్దమయ్యాయి. దమ్‌కీ బిర్యానీ, హలీం, కబాబ్, మటన్ మరగ్, మటన్ కోఫ్తా, మొఘలాయ్ మటన్, చికెన్, ఖుర్భానీ మిఠా, డ్రైఫ్రూట్స్ ఖీర్, నాన్‌రోటీ, రుమాలీ రోటీ, బగారా బైగన్‌తో పాటు నార్త్, సౌత్ ఇండియన్ సహా ఇటాలియన్, అమెరికన్ వంటకాలతో పాటు నిజాం నవాబులు తిన్న వంటకాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.

పది రకాల బిర్యానీ అందుబాటులో ఉంది. కొద్దిసేపటి క్రితమే ఇవాంకా, మోడీ  మరియు ప్రపంచ అతిథులు ఫలక్ నామా ప్యాలెస్ కు చేరుకున్నారు. 108అడుగుల డైనింగ్ టేబుల్ పై 101 మంది ఒకేసారి భోజనం చేయనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ బిర్యానీని, హలీమ్‌ను  అతిథిలకు రుచి చూపించబోతున్నారు.