ఇవాంకా డిన్నర్ వీడియో లీక్‌పై అమెరికా షాక్... - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకా డిన్నర్ వీడియో లీక్‌పై అమెరికా షాక్…

November 29, 2017

అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ అమెరికా అధ్యక్షుడి కూతురు  ఇవాంకా హైదరాబాద్ సదస్సులో పాల్గొంటున్నది. మొదటిరోజే చివరి నిమిషంలో భద్రత నీరుగారిపోనట్టయింది. ప్రధాని మోడీ, ఇవాంకా ట్రంప్, ముఖ్యమంత్రి కేసీఆర్, జీఈఎస్‌ సదస్సులో  పాల్గొన్న ప్రతినిధులందరూ మంగళవారం రాత్రి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో  కేంద్రం ఇచ్చిన విందుకు హాజరయ్యారు.

అయితే 101వ టేబుల్‌లో ఎవరెవరు కూర్చున్నారు, ఏమేం తింటున్నారు, ప్యాలెస్‌లోని ఇతర ప్రముఖులతో పాటు భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. ఈ విషయంలో తొలుత నుంచిీ ఎంతో గోప్యత పాటిస్తున్నది ప్రభుత్వం. ఈ విషయం తెలిసి అటు అమెరికా నిఘా వర్గాలు, ఇటు మన  పోలీసు ఉన్నతాధికారులు అవాక్కయ్యారు.  ఇలా ఎవరు సీసీటీవీ ఫుటేజీని బయటకు పొక్కేలా చేశారని దర్యాప్తు సాగిస్తున్నారు.. వెంటనే ఆ వీడియో ఫుటేజీని నిలిపివేశారు.