ప్రముఖ దర్శకుడు కట్టా రంగారావు కన్నుమూత..

 ఇంద్ర ధనుస్సు, ఆఖరి క్షణం, ఉద్యమం, అలెగ్జాండర్, నమస్తే అన్నా, బొబ్బిలి బుల్లోడు, వారెవా మొగుడా, చెప్పుకోండి చూద్దాం వంటి జనరంజక చిత్రాలను రూపొందించిన ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు కట్టా రంగారావు అనారోగ్యంతో కన్నుమూశారు. తెలంగాణకు చెందిన ఈయన కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చారు. 1957 మే 5వ తేదీన జన్మించిన రంగారావు ‘ఇంద్రధనుస్సు’ చిత్రంతో దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ప్రారంభంలో విప్లవ భావజాల సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నారు.

Telugu news Famous director Katta Ranga Rao passed away .

1990ల్లో తన రూటు మార్చి కమర్షియల్ సినిమాలు తెరకెక్కించారు. సుమారు 40 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో వున్నారాయన. ఆయ‌న దర్శకుల సంఘంలోనూ ప‌నిచేశారు.

చివరగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశారాయన. సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లాలోని మేడారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రంగారావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

Telugu news Famous director Katta Ranga Rao passed away