ఘోరం.. గొర్రెలు మేపొద్దన్నందుకు గొడ్డలితో.. - MicTv.in - Telugu News
mictv telugu

ఘోరం.. గొర్రెలు మేపొద్దన్నందుకు గొడ్డలితో..

January 9, 2019

తన పొలంలో గొర్రెలు మేపవద్దన్న రైతుపై  కాపరి గొడ్డలితో దాడి చేశాడు. అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలం కాకునూరులో చోటు చేసుకుంది. కాకునూరు గ్రామానికి చెందిన టేకుల కృష్ణ తన పొలంలో పత్తి సాగు చేశాడు. మంగళవారం గొర్రెల కాపరి కరికె నర్సింహులు గొర్రెలను తోలుకుని వెళ్లి కృష్ణ పత్తి పైరులో మేపేందుకు వదిలాడు. దీంతో అక్కడే వున్న రైతు తన పొలంలో గొర్రెలను మేపవద్దని హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. ఆగ్రహానికి లోనైన నర్సింహులు, కృష్ణపై గొడ్డలితో దాడి చేశాడు.

Telugu news Farmers attacked with ax .. For the sake of not living sheep in the field …

దీంతో కృష్ణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతణ్ణి కుటుంబ సభ్యులు ఆటోలో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న కృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కృష్ణ తల్లి లింగాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Telugu news Farmers attacked with ax .. For the sake of not living sheep in the field …