‘ నాన్నకూచి ’లో తండ్రీ కూతురు    - MicTv.in - Telugu News
mictv telugu

‘ నాన్నకూచి ’లో తండ్రీ కూతురు   

October 28, 2017

నిజ జీవితంలో తండ్రీకూతుర్లు , స్క్రీన్ మీద కూడా తండ్రీ కూతుర్లుగా నటిస్తే ఎలా వుంటుంది, చాలా బాగుంటుంది. ఇంతకీ ఆ తండ్రీ కూతుళ్ళు ఎవరంటే.. నాగబాబు, నిహారిక. ‘ నాన్న కూచి ’ అనే వెబ్‌సిరీస్‌లో ఇద్దరూ తండ్రీ కూతుర్లుగా నటిస్తున్నారు.

ఈ విషయాన్ని కొడుకు, అంటే నిహారికకు అన్న, నాగబాబుకు కొడుకైన వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. దీనికి సంబంధించిన టీజర్ అక్టోబర్ 29 ఉదయం 11 గంటలకు విడుదల అవుతున్నట్టు కూడా తెలిపాడు. ‘ ముద్దపప్పు ఆవకాయ ’ అనే వెబ్‌సిరీస్‌లో నటించి నిహారిక మంచి గుర్తింపును సంపాదించుకున్న విషయం విధితమే. తాజాగా వస్తున్న ఈ తండ్రీ కూతుళ్ళ వెబ్‌సిరీస్‌కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.