పోర్న్ చూస్తున్నాడని..కొడుకు చేయి నరికేశాడు ! - MicTv.in - Telugu News
mictv telugu

పోర్న్ చూస్తున్నాడని..కొడుకు చేయి నరికేశాడు !

March 6, 2018

పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు ఎవ్వరి చేతుల్లో చూసినా కూడా స్మార్ట్ ఫోన్లే  కనిపిస్తున్నాయి. స్కూల్ కెళ్లే పిల్లాడి దగ్గర నుండి కాటికెళ్లే ముసలోల్ల దాకా స్మార్ట్ ఫోన్లలోనే పొద్దెళ్ల తీస్తున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పక్కదారి పడుతోందని పచ్చి నిజం. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో కొడుకు తరచుగా పోర్న్ చూస్తున్నాడని ఓ తండ్రి కొడుకు చేయి నరికేశాడు.

పాతబస్తీలోని  జల్ పల్లి ప్రాంతంలో ఉండే ఖయ్యుం ఖురేషి  మాంసం వ్యాపారి. అయితే అతని పెద్దకొడుకు ఖాలెద్ ఖురేషి(18)   కుటుంబ పరిస్థితుల వల్ల కేబుల్ టీవీ ఆఫీసులో పనిలో పెట్టాడు. అయితే కొడుకు తండ్రి చూపెట్టిన పనికి వెళ్లకపోగా ఇంట్లోనే ఉంటూ  తరచూ పోర్న్ వీడియోలు చూడడం మొదలు పెట్టాడు. దీన్ని గమనించిన ఆ తండ్రి కొడుకును చాలా సార్లు మందలించాడు. అయినా తండ్రి మాట వినకుండా ఆ కొడుకు పోర్న్ చూడడమే పనిగా పెట్టుకున్నాడు.

ఓ రోజు అతని దగ్గర నుండి ఫోన్  గుంజుకుంటుండగా తండ్రి చేయి కొరికి కొడుకు పారిపోయాడు. ఆ తర్వాత రోజు కూడా కొడుకు పోర్న్ చూస్తుండడంతో కోపంతో ఊగిపోయిన తండ్రి మాంసం కొట్టే కత్తితో కొడుకు కుడి చేతిని నరికేశాడు. ఖాలెద్‌ కేకలు వేయడంతో అతని తల్లి పరుగెత్తుకొచ్చి స్థానికుల సాయంతో ఆసుపత్రిలో చేర్పించింది. తండ్రి పోలీసుల వద్ద వెళ్లి లొంగిపోయాడు.