ఎఫ్‌బీ వర్క్‌ప్లేస్ చాట్ యాప్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎఫ్‌బీ వర్క్‌ప్లేస్ చాట్ యాప్

October 28, 2017

సరికొత్త ఫీచర్లతో దూసుకుపోతున్న ఫేస్‌బుక్ మరో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిపేరు వర్క్ ప్లేస్ చాట్ యాప్. ఫేస్‌బుక్‌ వర్క్‌ప్లేస్‌కు ఈ యాప్‌ లింక్‌ అయి ఉంటుంది. ఈ యాప్ ఆఫీసులో వివిధ విభాగాల వ్యక్తులను కనెక్ట్ చెయ్యటం కోసం ఎఫ్‌బీ దీన్ని రూపొందించింది. తోటి ఉద్యోగులు గ్రూపు ప్రాజెక్టులపై చాటింగ్ ద్వారా డిస్కస్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, పీఎస్‌లలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

గ్రూపు సభ్యులు వీడియో చాటింగ్ కూడా చేసుకోవడం వల్ల ఆఫీసులో పనివేగం పెరుగుతందంటున్నారు . ఆఫీసులలో ఉద్యోగస్తులు ఎక్కువ సమయం ముబైల్ కంటే డెస్క్‌టాప్‌ల‌నే ఎక్కువగా వాడుతుంటారు. అందుకోసం డెస్క్‌టాప్ యాప్‌ను కూడా ఫేస్‌బుక్ తీసుకు వచ్చింది. ఈ యాప్ ద్వారా పలు ముఖ్యమైన అంశాలపై కూడా లైవ్‌ వీడియో సెషన్స్‌ ద్వారా ఉద్యోగులు చర్చించుకోవచ్చు. ఈ వర్క్‌ప్లేస్‌ చాట్‌ ద్వారా సహోద్యోగులందరూ గ్రూపు వీడియో చాట్ చేసుకోవచ్చు. ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. స్క్రీన్ షేరింగ్, మెసేజ్ రియాక్షన్స్, జీఐఎఫ్ వంటి షీచర్లతో వర్క్ ప్లేస్ యాప్ అలరించనున్నది.