mictv telugu

హార్దిక్ పాండ్యాకు చుక్కలు.. ఈ రోజు చేసే వచ్చావా?

February 9, 2019

తమ గురించి అనుచితంగా మాట్లాడిన టీమిండియా అటగాడు హార్దిక్ పాండ్యాపై మహిళలు ఇంకా ఆగ్రహంతో రగిలిపోతూనే ఉన్నారు. అతణ్ని సోషల్ మీడియాలోనే కాకుండా స్టేడియంలోనూ ఒక ఆట ఆడుకుంటున్నారు. అతని వ్యాఖ్యలను అతనికే అప్పగిస్తూ భగ్గుమంటున్నారు.telugu news Female spectator uses banner to troll Hardik Pandya over Koffee with Karan controversyఆక్లాండ్‌లో న్యూజీలాండ్‌తో జరిగిన రెండో వన్డీ మ్యాచులో ఓ మహిళ ప్లకార్డు పట్టుకని పాండ్యాకు చుక్కలు చూపింది.. ‘పాండ్యా ఈ రోజు చేసే వచ్చావా?’ అని ప్లకార్డుపై రాసి ఉంది. ఆమెతో పాటు పలువురు పాండ్యాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అతనికి తలకొట్టేసినట్లయింది.

బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ నిర్వ‌హించే `కాఫీ విత్ క‌ర‌ణ్‌` కార్య‌క్ర‌మంలో పాండ్యా, మరో క్రికెటర్ కేఎల్ రాహుల్‌లు మహిళలను ‘అదీ.. ఇదీ’ అని చులకగా మాట్టాడడం తెలిసిందే. `నేను మా ఇంట్లో ఏమీ దాచ‌ను. నేను తొలిసారి సెక్స్ చేసి వచ్చినప్పుడు ఆ రోజు అది చేశానని మా ఇంట్లో వారికి చెప్పా..’ అని అన్నాడు. దాన్ని ప్రస్తావిస్తూ ఓ ప్రేక్షకురాలు. ‘పాండ్యా ఈ రోజు చేసే వచ్చావా?’ అని ప్లకార్డు ప్రదర్శించింది.  

https://twitter.com/manrajr9/status/1093812531271852032