స్పెయిన్‌లో జాలీగా  ‘ఫిదా’ భామ - MicTv.in - Telugu News
mictv telugu

స్పెయిన్‌లో జాలీగా  ‘ఫిదా’ భామ

December 9, 2017

వచ్చీ రావటంతోనే తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన సాయిపల్లవి వరుస అవకాశాలతో చాలా బిజీ అయిపోయింది. ఎంత బిజీగా వున్నా అప్పుడప్పుడిలా కాస్త టైం తీసి జాలీగా  ట్రిప్ వేస్తే ఏం పోతుందని అనుకున్నట్టున్నది. అనుకున్నదే తడవుగా చెల్లి పూజా కన్నన్‌తో కలిసి చక్కా స్పెయిన్ చెక్కేసింది. అక్కడి చూడచక్కని ప్లేసుల్లో ఫోటోలకు పోజులిచ్చేస్తోంది. ఎప్పుడూ సినిమాలు, షూటింగ్‌లతో బిజీగా వున్న సాయిపల్లవి పంజరం వీడిన చిలక మాదిరి స్పెయిన్‌లో చూడని ప్రదేశాలు వుండకూడదన్నట్టు అన్నీ చుట్టేసింది.

ఇద్దరు అక్కాచెళ్ళెల్లు కలిసి దిగిన ఫోటోలను ఆమె చెల్లెలు పూజా కన్నన్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ జోష్‌తో తదుపరి చేయబోయే సినిమాలు చేసుకుపోవాలని భావిస్తున్నట్టున్నది సాయి పల్లవి. ప్రస్తుతం తెలుగులో ‘ఎమ్‌సీఏ ’, ‘కణం’ అనే సినిమాల్లో నటిస్తున్నది.