ఫిఫా టోర్నీలో నెత్తురు పారిస్తాం.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫిఫా టోర్నీలో నెత్తురు పారిస్తాం..

October 26, 2017

2018 లో అత్యంత అట్టహాసంగా రష్యా వేదికగా మొదలు కానున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌పై ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కన్నేసింది. ఈ టోర్నీలో రక్తపాతం సృష్టిస్తామని,,దానిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండని హెచ్చరికలు కూడా జారీ చేసింది.

దానికి సంబంధించిన ఒక భయంకరమైన ఫోటో కూడా విడుదల చేసింది. ఆ ఫోటోలో అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టు కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ కటకటాల వెనక నిలబడి రక్త కన్నీరు పెట్టుకుంటున్నట్టుగా ఉంది. ‘అపజయమంటే ఏంటో తెలియని రాజ్యంతో మీరు పోరాడుతున్నారు’ అని హెచ్చరించింది ఐసిస్.  ఈ హెచ్చరికల నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా ఇప్పటినుండే ఫిఫా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.  లోపరహిత భద్రతను కల్పించాలని రష్యా ప్రధాని పుతిన్ పోలీసు అధికారులను ఆదేశించారు.