నటి సుమలత పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం

కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన భార్య సుమలత రాజకీయాల్లోకి రాబోతున్నదట. తన భర్త అంబరీష్ ప్రాతినిధ్యం వహించిన మండ్యా నుంచే రాబోయో లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఎంపీగా బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది.

Telugu News Film fraternity wants Mandya LS seat for Sumalatha .

అంబరీష్ సంస్మరణ సభకు పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవ్వగా సుమలత రాజకీయ రంగ ప్రవేశం గురించి వచ్చిన చర్చలో సుమలత అందుకు అంగీకారం తెలిపినట్లుగా సమాచారం. దీనికి అంబరీష్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోతే జేడీఎస్ నుంచి గానీ లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా గెలిపించుకుంటామని అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. సుమలత కుమారుడు, సినీ హీరో అభిషేక్ సైతం తన తల్లి పొలిటికల్ ఎంట్రీపై సుముఖత వ్యక్తం చేసాడు.

Telugu News Film fraternity wants Mandya LS seat for Sumalatha