పోరాడి..నిలిచి గెలిచిన విశాల్ - MicTv.in - Telugu News
mictv telugu

పోరాడి..నిలిచి గెలిచిన విశాల్

December 5, 2017

అవును విశాల్  పోరాడి నిలిచి గెలిచాడు. ఆదిలోనే అసలైన రాజకీయాన్ని రుచి చూసిన విశాల్ కృంగి పోలేదు. నామినేషన్ ఎందుకు రద్దు చేశారంటూ గద్దించి నినదించాడు. పోటీ చేయడానికి తనకున్న  అర్హతలను ఎన్నికల అధికారులకు స్పష్టం చేశాడు. చివరకు కొట్లాడి గెలుపు సాధించాడు.

 

తమిళనాడులో ఉప ఎన్నికలకు విశాల్ స్వతంత్ర అభ్యర్ధిగా సోమవారం నామినేషన్ వేశాడు. అయితే విశాల్ వేసిన నామినేషన్ లో వివరాలు సరిగా లేవంటూ ఎన్నికల అధికారులు నామినేషన్‌ను తిరస్కరించారు. తన నామినేషన్ తిరస్కరించినందుకు విశాల్ వెనకడుగు వేయలేదు, తన మద్దతుదారులతో ధర్నాకు దిగాడు.

నేను చేసిన తప్పేంటో చెప్పాలని నిలదీశాడు.  విశాల్ ఇచ్చిన వివరణకు సంతృప్తి వ్యక్తం చేసిన ఎలక్షన్ కమిషన్ అధికారులు చివరికి ఆయన నామినేషన్‌ను ఆమోదించారు. ‘నిజం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది’ అని విశాల్ తన ట్వీట్ ద్వారా అందరితో పంచుకున్నాడు.