జీఎస్టీ పేరుతో దండుకుంటే 25వేలు ఫైన్ - MicTv.in - Telugu News
mictv telugu

జీఎస్టీ పేరుతో దండుకుంటే 25వేలు ఫైన్

October 25, 2017

తూనికలు, కొలతల విభాగంపై పౌరసరఫరాల కమీషనర్ సీవీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అమ్మకం దారులు చట్ట విరుద్ధంగా  వినియోగదారులపై పన్నులు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు’.

వస్తువు ఎంఆర్‌పి కంటే ఎక్కో జీఎస్టీ వేస్తే వాళ్లపై కేసులు పెట్టి, రూ.2 వేల నుంచి రూ.25 వేల దాకా జరిమానా విధిస్తామని అన్నారు. ఎంఆర్‌పికి అదనంగా జీఎస్టీ వసూలుపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు  ఆయన చెప్పారు. వినియోగదారుల సౌకర్యార్థం ఫిర్యాదు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న పౌరసరఫరాల వాట్సప్ నెంబర్ 733 0774 444 తోపాటు తూనికలు కొలతలశాఖ 738 6136 907, 27612170 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సమాచారాన్ని అందజేశారు.